ఏపీ లో బీసీలకు కొత్త మంత్రులుగా అవకాశం!?

Friday, July 3rd, 2020, 12:12:25 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో భారీ మెజారిటీ తో గెలుపొందిన వైసీపీ పార్టీ లో పలు కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఎమ్మెల్సీ లు గా ఉండటం చేత సుభాష్ చంద్రబోస్, మోపిదేవి లకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మంత్రి పదవుల్ని కట్టబెట్టారు. అయితే మండలి రద్దు నిర్ణయం దృష్ట్యా వారిని రాజ్యసభ కి ఎంపిక చేయడం జరిగింది. అయితే ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో గెలుపొందిన సుభాష్ చంద్రబోస్ మరియు మోపిదేవి వెంకటరమణ లు ఇద్దరు తమ పదవులకు రాజీనామా చేయడం జరిగింది.

అయితే ఈ మేరకు వారి స్థానాల్లో ఎవరు వస్తారు అనే దాని పై రాష్ట్రం లో చర్చలు మొదలు అయ్యాయి.కేబినెట్ విస్తరణకు ఈ నెల 22 న తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. అయితే సుభాష్ చంద్రబోస్ మరియు మోపిదేవి వెంకటరమణ లు ఇద్దరు కూడా బీసీ వర్గానికి చెందిన వారు కావడం తో జగన్ బీసీ లకు మంత్రి పదవుల్ని కట్టబెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి దీని పై సీఎం జగన్ మరియు మిగతా కీలక నేతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.