బిగ్ న్యూస్ : పవన్ – సోము వీర్రాజుల భేటీలో ఈ కీలక అంశాలు చర్చించారా?

Friday, August 7th, 2020, 03:42:48 PM IST

ఏపీలో బలపడేందుకు ప్రయత్నిస్తున్న నాలుగో పార్టీ ఏదైనా ఉంది అంటే అది భారతీయ జనతా పార్టీ అని చెప్పాలి. మొదటి నుంచి కాస్త వెనుక స్థానంలోనే ఉన్న పార్టీ నిర్మాణాత్మకంగా ఎదిగేందుకు ప్రయత్నిస్తుంది. అయితే వారికి బలమైన ప్రజాధారణ కలిగిన జనసేన పార్టీ అధినేత పవన్ తో పెట్టుకున్న పొత్తు ఏపీలో వారికి మరింత దన్నుగా నిలిచింది. ఇదిలా ఉండగా ఇటీవలే ఏపీ బీజేపీ పార్టీకు కొత్త అధ్యక్షునిగా సోము వీర్రాజు నియమితులు కాబడిన సంగతి తెలిసిందే.

అలాగే ఆయన నిన్ననే సినీ నటులు మెగాస్టార్ చిరంజీవిని వారి ఇంటి వద్దకు వెళ్లి కలిశారు. అలాగే నేడు మొదటిసారిగా బీజేపీ అధ్యక్షుని బాధ్యతలు చేపట్టిన అనంతరం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను వెళ్లి కలిశారు. అయితే ఇపుడు వీరిద్దరి కలయిక హాట్ టాపిక్ గా మారింది. వీరిద్దరూ ఏయే అంశాలు చర్చించుకున్నారో ఇప్పుడు తెలుస్తుంది. జ‌న‌సేన‌తో క‌లిసి రాబోయే రోజుల్లో బీజేపీ ప్ర‌ణాళిక‌ల‌కు సంబంధించిన కీల‌క అంశాల్ని ఈ భేటీలో చర్చించినట్టు సమాచారం.

అలాగే ముఖ్యంగా ఏపీ అభివృద్ధి విషయంలో ఆర్థికంగా, సామాజికంగా మరియు నిర్మాణాత్మ‌కంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్ద‌డానికి ప్రణాళికలు వెయ్యాలని వీరు అనుకున్నట్టు తెలుస్తుంది. అలాగే ఇప్పుడు ఏపీలో సంచలనం రేపుతున్న తాజా అంశం అమరావతి రైతులు అంశం మరియు 2024 వరకు ఎలా కలిసి అని చెయ్యాలి అన్న వాటిపై వీరి చర్చలో సాగిన కీలక అంశాలు అన్నటు సమాచారం.