బిగ్ న్యూస్: తెలుగు రాష్ట్రాల్లో 10 రెడ్ జోన్ జిల్లాలు ఇవే!

Monday, April 6th, 2020, 09:20:29 PM IST

కరోనా మహమ్మారి భారత దేశంలో ఉగ్ర రూపం దాల్చుతుంది. పలు రాష్ట్రాల్లో నమోదు అవుతున్న సంఖ్యలు చూస్తుంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో సైతం కారొన్ విజృంభిస్తోంది. అయితే కేంద్ర ప్రభుత్వం కరోనా వైరస్ ఎక్కువగా ఉన్న జిల్లాలను రెడ్ జోన్ గా ప్రకటించింది. అందులో తెలుగు రాష్ట్రాల్లో మొత్తం పడి జిల్లాలు ఉన్నాయి.

తెలంగాణ లో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలను అత్యధిక కరోనా ప్రభావం కలిగిన ప్రాంతాలుగా కేంద్రం గుర్తించింది. ఇప్పటివరకు 334 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఒక్క హైదరాబాద్ లోనే సగానికి పైగా ఎక్కువగా నమోదు అయినట్లు తెలుస్తోంది.

అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో నెల్లూరు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, విశాఖ పట్టణం, తూర్పు గోదావరి, చిత్తూరు జిల్లాలను రెడ్ జోన్ లుగా ప్రకటించింది. అయితే ఈ కరోనా నీ కట్టడి చేసేందుకు అవసరమైతే ఈ లాక్ డౌన్ నీ మరింత కఠిన తరం చేసి ఆంక్షలను పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది.