బిగ్ బ్రేకింగ్: ఆంధ్ర ప్రదేశ్ లో కోవిడ్19 రెడ్ అలెర్ట్ లో ఉన్న జిల్లాలు ఇవే!

Sunday, April 5th, 2020, 08:31:27 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువగా కరోనా వైరస్ కేసులు నమోదు అవుతున్న లిస్ట్ నీ బయటపెట్టింది. అయితే కరోనా వైరస్ కారణం బాధపడుతున్న పేషంట్ నంబర్ 131 నుండి 190 వరకు ఉన్న వివరాలు తెలియజేసింది. అంతేకాదు ఎక్కువగా నమోదు అయ్యే ప్రాంతాలు మాత్రమే కాకుండా ఇవి రెడ్ జోన్ లో ఉన్నల్తుగా తెలుపుతూ ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే ఈ రెడ్ జోన్ కలిగి ఉన్న జిల్లాలు నెల్లూరు, కృష్ణ, కడప, వెస్ట్ గోదావరి, ప్రకాశం, గుంటూరు, ఈస్ట్ గోదావరి, విశాఖపట్టణం, చిత్తూరు, కర్నూల్. అయితే పైన తెలిపినా నంబర్ పేషంట్ ద్వారా ప్రైమరీ కేసులు నమోదు అయ్యాయి అని, వారిని క్వారంటైన్ లో ఉంచామని అన్నారు.