అందానికి విలువలేదన్న అక్షర హాసన్!

Sunday, February 22nd, 2015, 08:40:05 PM IST


ప్రముఖ వైవిధ్య నటుడు కమల్ హాసన్, అలనాటి మేటి తార సారికల గారాలపట్టి అక్షర హాసన్ ఒక ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో తన మనోభావాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనకు నటనపై కన్నా దర్శకత్వం పైనే అభిరుచి ఎక్కువని, అయితే ప్రముఖ దర్శకుడు బాల్కి ఇచ్చిన అవకాశంతో నటిగా కెరీర్ ప్రారంభించానని తెలిపారు. అలాగే తన తొలి చిత్రం ‘షమితాబ్’ లో ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ తో నటించడం గొప్ప వరమని, ఆయన తనను బాగా నటించావని మెచ్చుకున్నప్పుడు భావోద్వేగానికి గురయ్యానని అక్షర తెలిపారు.

ఆమె ఇంకా మాట్లాడుతూ 2009 నుండి ముంబైలో ఉండడం వలన హిందీ బాగా మాట్లాడగలుగు తున్నానని, చిన్నప్పటి నుండి చదువుపై కన్నా ఇతర కళలపై ఆసక్తి ఉండడంతో ఇంటర్ మొదటి సంవత్సరం చదివి ఎడ్యుకేషన్ కు గుడ్ బై చెప్పానని వివరించారు. ఇక తన అక్క శృతి హాసన్ విగ్రహారాధన చేస్తారని, తాను మాత్రం ఏదో శక్తి ఉందని నమ్ముతాను కాని విగ్రహారాధన చెయ్యనని అక్షర స్పష్టం చేశారు. అలాగే తనకు చిన్నప్పటి నుండి ఎవరైనా ఆకలేస్తోందని డబ్బులు అడిగితే పర్సులో ఉన్న పాకెట్ మనీ అంతా ఇచ్చేసే అలవాటు ఉండేదని అక్షర తెలిపారు. ఇక అందం దేవుడు ఇచ్చినదని, కాని బాహ్య సౌదర్యం కన్నాఅంతః సౌందర్యమే గొప్పదని అక్షర స్పష్టం చేశారు.