అక్కడ వంద శాతం సిట్టింగ్ కెపాసిటీ తో తెరుచుకొనున్న థియేటర్లు

Monday, January 4th, 2021, 01:29:21 PM IST

కరోనా వైరస్ మహమ్మారి కారణం గా థియేటర్లు మూత బడిన సంగతి తెలిసిందే. అయితే మళ్ళీ సినిమాలు రావడం తో పలు రాష్ట్రాలు 50 శాతం సిట్టింగ్ కెపాసిటీ తో అనుమతులను ఇచ్చాయి. అయితే ఇప్పుడు సంక్రాంతి పండుగ దగ్గర పడుతుండటంతో సినిమాలు పలు రాష్ట్రాలు వీటి పై కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే అందులో భాగంగానే తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం మరొక నిర్ణయం తీసుకుంది. ఇక థియేటర్లు వంద శాతం సిట్టింగ్ కెపాసిటీ తో ఓపెన్ చేసుకునే విధంగా అనుమతి ఇవ్వడం జరిగింది. అయితే అక్కడ కరోనా వైరస్ నిబంధనలను కచ్చితంగా పాటించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది.

అయితే థియేటర్లకు వంద శాతం సిట్టింగ్ కెపాసిటీ తో అనుమతులు ఇవ్వడం పట్ల పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.అయితే సినిమా ప్రేమికులు, మరియు ధియేటర్ యాజమాన్యాలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.