పెద్దపల్లి జిల్లాలో కలకలం – కాల్పులతో బెంబేలెత్తుతున్న ప్రజలు…

Friday, February 14th, 2020, 01:00:41 PM IST

తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లాలో నేడు ఒక కలకలం రేగింది. కాగా పెద్దపల్లి జిల్లాలోని ధర్మారం మండలం శాయంపేట గ్రామానికి చెందిన ఒక రిటైర్డ్ ఆర్మీ జవాన్ బద్దం తిరుమల రెడ్డి ఒక్కసారిగా గాల్లోకి కాల్పులు జరపడంతో స్థానికులందరు కూడా భయాందోళనకు గురయ్యారు. కాగా పెద్దపల్లి జిల్లాలోని ధర్మారం మండలం సాయంపేటలోని ఒక పెళ్లి భారత్ లో పలువురి మధ్యన ఒక చిన్న వివాదం కాస్త ముదిరి ముదిరి పెద్ద గొడవకు దారి తీసింది. అయితే ఈ గొడవ అనంతరం ఒక రిటైర్డ్ ఆర్మీ అధికారి బద్దం తిరుమలరెడ్డి అనే వ్యక్తి తన వద్ద ఉన్న తుపాకీతో ఒక్కసారిగా గాల్లోకి కాల్పులు జరిపాడు. అయితే ఈ ఘటనతో ఉలిక్కిపడ్డ స్థానికులు ఒక్కసారిగా తీవ్రమైన భయాందోళనకు గురయ్యారు. అయితే ఈ విషయాన్నీ స్థానికులు పోలీసులకు తెలియజేయడంతో మరుసటిరోజు ఉదయం ఘటా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడు తిరుమల రెడ్డి ని అదుపులోకి తీసుకోని పోలీస్ స్టేషన్ కి తరలించారు.