ఎన్నికల ఫలితాల అనంతరం ప్రముఖుల స్పందన

Friday, May 16th, 2014, 08:20:10 PM IST


నరేంద్ర మోడీ
భారత నూతన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్నికల ఫలితాల అనంతరం భావోద్వేగంగా స్పందించారు. భారతదేశం మొత్తం తనపై అభిమానం కురిపించిందని మోడీ ఆనందం వ్యక్తం చేశారు. భారత ప్రజాస్వామ్యంలోని తనలాంటి వ్యక్తిని ప్రధాని అయ్యే భాగ్యం కలిగిందని అదే భారత దేశం గొప్పదనమని ఆయన అన్నారు. బీజేపీపై నమ్మకముంచిన దేశ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

కేసీఅర్
ఈ విజయం, తెలంగాణ ప్రజలది మరియు కార్యకర్తలదే. ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రి కాబోతున్న చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలియ చేశారు. అలాగే మోడీకి కూడా అభినందనలు తెలిపాడు. అమరవీరులకు గెలుపును అంకితం ఇస్తూ, వారి కుటుంబాలను అదుకుంటామని హామీ ఇచ్చారు. తెలంగాణ అభివృద్ధిలో మీడియా సహకారం కూడా ఉండాలని అయన కోరారు.

జగన్ మోహన్ రెడ్డి
ప్రజల తీర్పును గౌరవిస్తున్నాను, దేశమంతటా మోడీ గాలీ వీచింది. చంద్రబాబు మరియు కేసీఅర్ లకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే తాము ఎవరితోనూ పొత్తు పెట్టుకోము అని స్పష్టం చేశారు.

చంద్రబాబు నాయుడు
ఇది ప్రజా విజయమని, దేశ ప్రజలు సుస్థిర పాలన వైపు మొగ్గు చూపారని బాబు తెలిపాడు. ఇతర పార్టీలు ఎన్ని ప్రలోభాలకు గురి చేసిన ప్రజలు తెలుగుదేశం వైపే మొగ్గుచుపారన్నారు. సీమాంధ్రని పునాదుల నుండి నిర్మించాల్సిన అవసరం ఉందని అన్నారు.

పవన్ కళ్యాణ్
భాజపా తెలుగుదేశం కూటమి గెలువడం తనకు ఆనందాన్ని ఇచ్చిందని పవర్ స్టార్ పేర్కొన్నారు. తనకు ఎవరిమీద శత్రుత్వం లేదని కానీ, గత పదేళ్ళ కాలంలో జరిగిన దోపిడి తనను భాధపెటిందని అన్నారు. ఈ ఫలితాలు రాష్ట్ర అభివృద్ధికి శుభ పరిణామం అని తెలిపారు.


వెంకయ్య నాయుడు

కాంగ్రెస్ చేసిన మోసాలకు ప్రజలు తగిన బుద్ధి చెప్పారని అయన తెలిపారు. ప్రజలు మంచి పాలనకు ఓటు వేశారని, ప్రజలకు మరియు తమ గెలుపుకు సహాయపడ్డ మిత్ర పక్షాలకు ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో భాజపా తెలుగుదేశం పార్టీ కూటమిని గెలిపించి ప్రజలు తమ మాటలపై విశ్వాసం ఉంచారని అన్నారు.

సోనియా గాంధీ
ప్రజల తీర్పును అంగీకరిస్తామని సోనియా గాంధీ తెలిపారు. కాంగ్రెస్ ఓటమికి భాద్యత వహిస్తానని ఆమె అన్నారు. ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజమని, బారీ మెజారిటితో గెలిసిన కొత్త ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు.

రాజ్ నాథ్ సింగ్
సార్వత్రిక ఎన్నికలలో ఇంత బారీ మెజారిటితో గెలిపించినందుకు చాలా గర్వంగా ఉందని, అలాగే తమ పై ఎంతటి బారాన్ని పెట్టారో తమకు తెలుసునని అయన అన్నారు.