నిర్భయ కేసు : నిందితుడి పిటిషన్ ని కొట్టేసిన సుప్రీం కోర్టు

Friday, February 14th, 2020, 04:29:41 PM IST

గతంలో దేశ వ్యాప్తంగా సంచలనాలను సృష్టించినటువంటి నిర్భయ అత్యాచారం, హత్య కేసు దేశ వ్యాప్తంగా ఎంతటి సంచలనాలను సృష్టించిందో మనందరికీ తెలిసిందే. అయితే అంతటి దారుణానికి ఒడిగట్టిన ఆ మృగాలకు ఫిబ్రవరి నెలలో మరణ శిక్ష విధిస్తున్నారని దేశ వ్యాప్తంగా ఎదురు చూసారు. కానీ అలా జరగలేదు. ఇకపోతే ఆ నిందితుల్లో ఒకరైన వినయ్ శర్మ కి రాష్ట్రపతి క్షమాబిక్ష ని తిరస్కరించడంతో, సుప్రీం కోర్టు ను ఆశ్రయించి ఒక పిటిషన్ వేసుకున్నాడు. కాగా జైల్లో పెట్టినటువంటి శిక్షల వలన తాను మానసిక స్థిరత్వాన్ని కోల్పోయానని ఒక పిటిషన్ ని వేసుకున్నాడు. కాగా నేడు ఆ పిటిషన్ ని సుప్రీం కోర్టు కొట్టిపారేసింది.

ఇకపోతే ఈ నిందితులకు వేసిన ఉరి శిక్ష ని తప్పించుకోడానికి దోషులందరు కూడా ఒక్కొక్కరు కూడా రకరకాల పిటిషన్ ని వేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఎలాగైనా సరే ఈ నలుగురు మృగాలకు ఉరి శిక్ష వేయాలని మరణ శిక్ష విధించాలని ఢిల్లీలోని పాటియాలా కోర్టు పోరాడుతుంది. అయితే తాజాగా నిందితుడి పిటిషన్ ని కొట్టిపారేసిన న్యాయస్థానం, మల్లి వీరికి ఎప్పుడు మరణ శిక్ష ను అమలు చేస్తుందో చూడాలి మరి.