కోడిగుడ్డు ధర 46వేలు!

Monday, March 2nd, 2015, 12:17:49 PM IST

hen-egg
సహజంగా 5రూపాయల కన్నా తక్కువ పలికే కోడిగుడ్డు దాదాపు 46వేల రూపాయలకు అమ్ముడైన వైనం ఇటీవల వెలుగు చూసింది. కాగా ఇది ఆశ్చర్యం కలిగించే విషయం అయినా నిజం. మరి ఆ గుడ్డుకి ఏదో ప్రత్యేకత లేకపోతే అంత ధర పలకదు అనే అనుమానం సగటు మానవుడికి రాకమానదు. అయితే ఆ గుడ్డుకి మరీ అంత ప్రత్యేకత కూడా ఏమీలేదు. కాగా సహజంగా దీర్ఘవృత్తాకారంలో ఉండే కోడిగుడ్డు కాస్తా వృత్తాకారంలో దర్శనం ఇవ్వడమే ఇక్కడ ప్రత్యేకత.

వివరాలలోకి వెళితే బ్రిటన్లో ‘పింగ్ పాంగ్’ అనే పేరు గల అర్పింగ్ టన్ జాతికి చెందిన కోడిపెట్ట ఇటీవల గుండ్రటి కోడిగుడ్డును పెట్టిందట. అయితే కోడి యజమాని కిమ్ పేస్ బుక్ లో ఈ గుడ్డు ఫోటో షేర్ చెయ్యగా ఒక మిత్రుడు దీన్ని వేలం వేస్తే బాగా డబ్బు వస్తుందని సలహా ఇచ్చాడు. ఇక మిత్రుడి సలహా నచ్చడంతో వెంటనే కిమ్ ఈ గుడ్డును వేలానికి పెట్టగా మొత్తం 64 బిడ్లు దాఖలయ్యాయి. ఇక 100కోట్ల గుడ్లలో ఒకటి ఇలా ఉండవచ్చునని నిపుణులు కూడా తేల్చి చెప్పడంతో ఈ గుడ్డు అక్షరాల 480 పౌండ్లు అనగా సుమారు 46వేల రూపాయలకు అమ్ముడైంది. మరి కోడిగుడ్డుకు ఇంత ధర పలకడం అంటే ఆశ్చర్యకరమైన విషయమే కదా!