బిగ్ న్యూస్ : టీడీపీను వీడనున్న ఆ ఎమ్మెల్యే?అసలు క్లారిటీ.!

Sunday, May 31st, 2020, 04:04:53 PM IST

గత ఏడాది జరిగిన ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని చూసిన తెలుగు దేశం పార్టీ నుంచి ఊహించని స్థాయి వలసలు ఇతర పార్టీలలోకి మొదలయ్యాయి. దీనితో ఇక రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పనయ్యిపోయింది అని అంతా భావించారు.

ఓడిన వారు వెళ్లిపోయారు అనుకుంటే గెలిచినవారినైనా కాపాడుకోవాలని ఇప్పటి వరకు బాబు ఏదొకలా వారిని అడ్డుకుంటూ వస్తున్నారు. కానీ మధ్యలో ఎమ్మెల్యేగా గెలిచిన వల్లభనేని వంశీ పార్టీను వీడి షాకిచ్చారు.

ఇప్పుడు అదే బాటలో మరో ఎమ్మెల్యే కూడా టీడీపీను వీడనున్నారని వార్తలు హాట్ టాపిక్ అవుతున్నాయి. అతనే ప్రకాశం జిల్లా పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబ శివరావు. ఈయన ఇప్పుడు టీడీపీను వీడే యోచనలో ఉన్నారన్న వార్త టీడీపీ శ్రేణుల్లో కలకలం రేపుతోంది.

అయితే దీనిపై సాంబ శివరావు స్పందిస్తూ తానూ ఏ పార్టీలోనూ చేరబోను ముఖ్యంగా టీడీపీ పార్టీను వీడనని తెలిపినట్టు తెలుస్తుంది. కానీ మరోపక్క ఆయన వేరే మీటింగులు ఏవో పెడుతున్నారు ఖచ్చితంగా ఏదో చేస్తున్నారని టాక్ కూడా వినిపిస్తుంది.