మెగాస్టార్ చిత్రానికి థమన్ సంగీతం…మళ్ళీ ఆ మ్యాజిక్ రిపీట్ అయ్యేనా?

Wednesday, January 20th, 2021, 01:36:48 PM IST

సంగీత దర్శకుడు థమన్ టాలీవుడ్ లో వరుస అవకాశాలు దక్కించుకుంటున్నాడు. ఇప్పటి వరకు ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలకు సంగీతం అందించిన థమన్, మెగాస్టార్ చిరంజీవి కి మాత్రం తొలిసారిగా సంగీతం అందించనున్నారు. తెలుగు లూసీ ఫర్ చిత్రం కోసం మెగాస్టార్ చిరంజీవి చిత్రానికి థమన్ సంగీతం ఇచ్చేందుకు సిద్దం అయ్యారు. అయితే దర్శకుడు మోహన్ రాజ కు, మెగాస్టార్ చిరంజీవి కి ఈ అవకాశం ను ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ప్రతి కంపోజర్ కి ఇది చాలా పెద్ద డ్రీమ్ అని మనం లూసీ ఫర్ జర్నీ ను ప్రారంభిస్తున్నాము అని థమన్ చెప్పుకొచ్చారు.

సంగీత దర్శకుడు థమన్ ఇటీవల కాలంలో వరుస బ్లాక్ బస్టర్ చిత్రాలకు సంగీతం అందించారు. గతేడాది విడుదల అయిన అలా వైకుంఠ పురం లో చిత్రం యావత్ భారత దేశాన్ని ఒక ఊపు ఊపింది. అలానే మెగా హీరో లతో కూడా కలిసి పని చేసిన థమన్ తొలిసారిగా చిరు కి సంగీతం అందించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే మెగాస్టార్ చిరంజీవి సైతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఆచార్య చిత్రం అనంతరం మరొక రెండు చిత్రాలను లైన్ లో పెట్టినట్లు తెలుస్తోంది.