అక్కడ పదివేలకు పైగా నమోదు అయిన కరోనా కేసులు

Thursday, October 8th, 2020, 12:10:12 AM IST


కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత ఏ మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. ఈ తీవ్రత రోజురోజుకీ పెరుగుతోంది. కేరళ లో ఈ మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. గడిచిన 24 గంటల్లో 10,606 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అయితే ఒక్క రోజులోనే ఇన్ని కేసులు నమోదు కావడం ఈ రాష్ట్రం లో ఇదే తొలి సారి. తాజాగా నమోదు అయిన ఈ భారీ కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం కేరళ రాష్ట్రం లో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 2 లక్షల 51 వేలకు చేరింది. వీటి సంఖ్య మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

అయితే కరోనా వైరస్ చికిత్స పొందుతూ గడిచిన 24 గంటల్లో 22 మంది ప్రాణాలను కోల్పోయారు. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ మరణాల తో ఇప్పటి వరకు కరోనా వైరస్ సోకి మృతి చెందిన వారి సంఖ్య 906 కి చేరింది. కేరళ రాష్ట్రం లో ఎన్ని కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నా, నిబంధనలు పాటిస్తున్నా ఈ మహమ్మారి తీవ్రత తగ్గడం లేదు.