ఏపీలో విషాదం.. తిరుపతి రుయాలో ఆక్సిజన్ అందక 10 మంది మృతి..!

Monday, May 10th, 2021, 11:38:40 PM IST

ఏపీలో మరో విషాదం చోటు చేసుకుంది. తిరుపతి రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక 10 మంది కరోనా పేషంట్లు మృతి చెందారు. ఓ పక్క కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుండడం, పేషంట్లకు సరైన మోతాదులో ఆక్సిజన్ అందుబాటులో లేకపోవడంతో కళ్ళ ముందే రోగులు చనిపోతున్నా వైద్యులు కూడా ఏమీ చేయలేని పరిస్థుతులు చోటు చేసుకుంటున్నాయి.

అయితే తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో కరోనా ఆత్యవసర విభాగంలో ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం కలగడంతో ఎం.ఎం.1,2,3 వార్డులో ఆరుగురు, ఐసీయూలో ముగ్గురు, ఎం.ఎం.4,5,6లో ఒకరు మృతి చెందినట్టు సమాచారం. అయితే ఆక్సిజన్ ఫిల్లింగ్ చేసేపుడు కంప్రజర్ తగ్గటంతో సరఫరాకు అంతరాయం ఏర్పడిందని, ఆక్సిజన్‌ సరఫరా ప్రారంభించినా పరిస్థితి కుదుటపడలేదని మృతుల బంధువులు ఆసుపత్రి వద్ద ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.