మహారాష్ట్ర లో పది లక్షలు దాటిన కరోనా కేసులు

Saturday, September 12th, 2020, 02:06:58 AM IST

Corona_positive
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతుంది. భారీగా కరోనా కేసులు నమోదు కావడం తో ప్రజలు మరింత భయాందోళన చెందుతున్నారు. వేల సంఖ్యలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు, వందల సంఖ్యలో ఈ మహమ్మారి భారిన పడి ప్రాణాలను కోల్పోవడం పట్ల అధికారులు, వైద్యులు జాగ్రత్త చర్యలు తప్పక పాటించాలని సూచిస్తున్నారు. అయితే దేశం లో ఎక్కువగా కరోనా వైరస్ ప్రభావం మహారాష్ట్రలో ఉంది అని చెప్పాలి. గత కొద్ది రోజుల నుండి 20 వేలకు పైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి.

గడిచిన 24 గంటల్లో 24,886 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకూ 10,15,681 మందికి కరోనా వైరస్ సోకింది. అయితే కరోనా వైరస్ బాధితుల సంఖ్య పది లక్షలకు పైగా ఉండటం అక్కడి వారిని కలవరానికి గురిచేస్తున్నాయి. అయితే ఇప్పటి వరకూ 7,15,023 మంది కరోనా వైరస్ మహమ్మారి భారీ నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇంకా 271,566 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 393 మంది కరోనా వైరస్ భారిన పడి ప్రాణాలను కోల్పోగా, ఇప్పటి వరకూ 28,724 మంది ఈ వైరస్ భారిన పడి మృతి చెందారు.