ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్, జగన్!

Sunday, March 28th, 2021, 01:37:31 PM IST

హోలీ పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు ముఖ్యమంత్రులు ఇద్దరూ కూడా శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ మహమ్మారి కారణంగా గత ఏడాది నుండి ఎలాంటి పండుగలు కూడా జరుపుకోవడం లేదు. అయితే ఈ ఏడాది కూడా అదే తరహాలో కానున్నాయి. కోవిడ్ నిబంధనలను పాటించి, హోలీ జరుపుకోవాలి అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఎవరి ఇళ్ళళ్లో వాళ్ళే జరుపుకోవాలి అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సైతం హోలీ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు అంతా కూడా హోలీ ను ఆనందంగా జరుపుకోవాలి అని అన్నారు.