జగన్ నాయకత్వ మహిమ వలనే 2 లక్షల కరోనా కేసులు

Saturday, August 8th, 2020, 03:00:13 AM IST

TDP_party

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో కరోనా వైరస్ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతుంది. రోజుకి 10 వేలకు పైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. పదుల సంఖ్యలో కరోనా వైరస్ భారిన పడి బాధితులు ప్రాణాలను కోల్పోతున్నారు. అయితే సీఎం జగన్ మోహన్ రెడ్డి కరోనా వైరస్ మహమ్మారి ను అరికట్టదంలో తీసుకుంటున్న చర్యల పై తెలుగు దేశం పార్టీ ఇప్పటికే ఘాటు విమర్శలు చేస్తుంది. అయితే తాజాగా రాష్ట్రం లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 2 లక్షలకు చేరడం తో, తెలుగు దేశం పార్టీ పలు కీలక వ్యాఖ్యలు చేసింది.

అయితే తెలుగు దేశం పార్టీ పాలనలో పోలవరం నిర్మాణ రికార్డుల గురించో, యువతకి వచ్చిన ఉద్యోగాల గురించో మాట్లాడుకునే వాళ్ళం అంటూ వ్యాఖ్యానించడం జరిగింది. అయితే జగన్ మోహన్ రెడ్డి నాయకత్వ మహిమ వలన రాష్ట్రం 2 లక్షల కరోనా కేసులు నమోదు చేసింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో కరోనా వైరస్ మహమ్మారి ను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు రకాల చర్యలు తీసుకుంటున్నప్పతికి తెలుగు దేశం పార్టీ కి చెందిన నేతలు విమర్శలు చేస్తూనే ఉన్నారు.