తెలంగాణ పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదల..!

Tuesday, February 9th, 2021, 06:02:01 PM IST

తెలంగాణ పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను విద్యాశాఖ విడుదల చేసింది. మే 17 నుంచి 26 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఉదయం.9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్ష జరగనుంది. అయితే కరోనా కారణంగా విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభం కావడంతో ఈ సారి సిలబస్ తగ్గించడమే కాకుండా సబ్జెక్ట్‌కి ఒక్క పరీక్ష చొప్పున ఆరు పరీక్షలను మాత్రమే నిర్వహిస్తున్నారు.

అయితే మే 17న ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ (గ్రూప్ ఏ), ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 1 (కాంపోసిట్ కోర్స్), ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 2 (కాంపోసిట్ కోర్స్) ఎగ్జామ్ ఉంటుంది. మే 18న సెకండ్ లాంగ్వేజ్, మే 19న ఇంగ్లీష్, మే 20న మ్యాథమెటిక్స్, మే 21న జనరల్ సైన్స్ పేపర్ (ఫిజికల్ సైన్స్), జనరల్ సైన్స్ పేపర్ (బయాలజికల్ సైన్స్) ఎగ్జామ్, మే 22న సోషల్ స్టడీస్ ఎగ్జామ్, మే 24న ఓఎస్ఎస్‌సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 1 (సంస్కృతం, అరబిక్) ఎగ్జామ్, మే 25న ఓఎస్ఎస్‌సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 2 (సంస్కృతం, అరబిక్), మే 26న ఎస్ఎస్‌సీ వొకేషనల్ కోర్స్ (థియరీ) ఎగ్జామ్ ఉండబోతుంది.