తెలంగాణలో టీడీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. టీఆర్ఎస్లో టీడీఎల్పీ విలీనం అయ్యింది. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యేలు మచ్చా నాగేశ్వరరావు, సండ్ర వెంకట వీరయ్య టీఆర్ఎస్ఎల్పీలో టీడీఎల్పీని విలీనం చేస్తున్నట్టు స్పీకర్‌కు లేఖ ఇచ్చారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో వీరిద్దరు టీడీపీ నుంచి గెలుపొందారు. ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అధికార టీఆర్ఎస్ పార్టీలో అధికారికంగా చేరకపోయినా ఆ పార్టీకి దగ్గరగా ఉంటున్నారు.
అయితే తాజాగా అశ్వరావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వర్ రావు కూడా టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. శాసనసభా వ్యవహరాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో భేటీ అయిన ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు అధికారికంగా టీఆర్ఎస్ పార్టీలో చేరి టీడీఎల్పీని టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేస్తున్నట్టు స్పీకర్‌కు లేఖ ఇచ్చారు. ఈ సందర్భంగా ఇద్దరు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ కండువాలు ధరించి కనిపించారు. దీంతో తెలంగాణ శాసనసభలో టీడీపీకి ప్రాతినిథ్యం లేనట్టే అయ్యింది.