మాస్క్ లేకుంటే జరిమానా… హైదరబాద్ లో ప్రత్యేక డ్రైవ్!

Tuesday, March 30th, 2021, 09:37:32 AM IST

కరోనా వైరస్ మహమ్మారి మళ్ళీ విజృంభిస్తోంది. దేశ వ్యాప్తంగా భారీ గా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత ఎక్కువగా ఉండటం తో ట్రాఫిక్ పోలీసుల నేటి నుండి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నారు. అయితే మాస్క్ లేకుంటే నేటి నుండి భారీ గా జరిమానా లు విధించనున్నారు. తెలంగాణ రాష్ట్రం లో కోవిడ్ ను అరికట్టడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోనుంది. అయితే గుంపులు గా కనబడినా, మాస్క్ ధరించకుండా, భౌతిక దూరం పాటించకుండా ఉంటే ఇక పై చర్యలు తీసుకోనున్నారు.