కొత్త రెవెన్యూ చట్టం చారిత్రాత్మకం…సీఎం కేసీఆర్ పై మంత్రి ప్రశంసలు!

Wednesday, September 9th, 2020, 11:20:09 PM IST

KCR
తెలంగాణ రాష్ట్రం లో పలు కీలక మార్పులకి నాంది పలికారు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. నూతన రెవెన్యూ చట్టం చారిత్రాత్మకం అంటూ సీఎం కేసీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించారు మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు. కేసీఆర్ రైతు బాందవుడు అంటూ కొనియాడారు. సీఎం కేసీఆర్ గొప్ప సంస్కరణ వాది అని, ఆయన చేపట్టిన అనేక సంస్కరణ లో రెవెన్యూ చట్టం చారిత్రాత్మక మైనడి అని తెలిపారు. ఈ చట్టం నిరుపేద ప్రజలకు ఎంతో మేలు చేస్తుంది అని మంత్రి వ్యాఖ్యానించారు.

అయితే మంత్రి రెవెన్యూ చట్టానికి సంబంధించిన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన మొదలు అయింది అని, ఇలా చేయడం వలన అవినీతి తగ్గడం మాత్రమే కాకుండా భూ సమస్యలు సైతం సమసి పోతాయి అని తెలిపారు. అయితే తెలంగాణ రైతులకు సీఎం కేసీఆర్ చేస్తున్నంత గా ఇప్పటి వరకూ ఎవరూ చేయలేదు అని అన్నారు. కొత్త రెవెన్యూ చట్టంతో పంచాయతీల బాధ్యత మరింత గా పెరిగింది అని అన్నారు.ఇక సర్పంచ్ లు, కార్యదర్శులు నిబద్దత తో పని చేయాలి అని, కేసీఆర్ ఆదేశాలను అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి వ్యాఖ్యానించారు.