డబుల్ బెడ్ రూం ఇళ్ళ పంపిణీ విషయం లో అధికారులకు కేటీఆర్ కీలక ఆదేశాలు!

Friday, September 18th, 2020, 03:00:32 AM IST


తెలంగాణ రాష్ట్రం లో డబుల్ బెడ్ రూం ఇళ్ళ పంపిణీ ను రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇందుకు సంబంధించిన లబ్దిదారుల ఎంపిక విషయం లో మంత్రి కేటీఆర్ అధికారులకు కీలక ఆదేశాలను జారీ చేశారు. త్వరగా డబుల్ బెడ్ రూం లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అయితే గ్రేటర్ లో లక్ష డబుల్ బెడ్ రూం ఇళ్ళ నిర్మాణం కొనసాగుతుంది అని, త్వరలో ఈ నిర్మాణం పూర్తి అవుతుంది అని మంత్రికి అధికారులు తెలిపారు.

అయితే హౌసింగ్ శాఖ ఇచ్చిన విధంగా లబ్దిదారులను ఎంపిక చేయాలని తెలిపారు. అయితే GHMC పరిధి లో ఉన్న కలెక్టర్లతో కలిసి ఈ ఎంపిక ప్రక్రియ జరపాలని తెలిపారు. కడుతున్న ఇళ్లలో పదిశాతం లేదంటే వెయ్యికి మించకుండా స్థానికులకు ఇవ్వాలి అని నిర్ణయం తీసుకున్నాం అని తెలిపారు. అంతేకాక గతం లో ఇల్లు పొందిన వారికి మళ్లీ డబుల్ బెడ్ రూంఇల్లు రాకుండా చూడాలి అని, ఈ ప్రక్రియ ఎంతో పారదర్శకంగా జరగాలి అని తెలిపారు.