ఈ చట్టం వలన పేదలకు సరైన న్యాయం జరుగుతుంది – మంత్రి ఎర్రబెల్లి

Wednesday, October 7th, 2020, 02:13:19 AM IST


తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సీఎం కేసీఆర్ పాలన విధానం పై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. దేశానికే వెన్నెముక రైతు అని, అలాంటి రైతుకు అండగా నిలిచిన ఘనత సీఎం కేసీఆర్ కి దక్కుతుంది అని అన్నారు. అయితే జనగామ లోని పాలకుర్తి ప్రాంతం లో 130 మందికి మంత్రి డిజిటల్ పట్టాదారు పాస్ పుస్తకాల్ని పంపిణీ చేయడం జరిగింది. అయితే రైతును రాజు చేయడమే ప్రధాన ధ్యేయం గా సీఎం కేసీఆర్ నేతృత్వం లో రాష్ట్ర ప్రభుత్వం పాన్ చేస్తోంది అని మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు.

అయితే కరోనా వైరస్ మహమ్మారి లాంటి కష్ట కాలం లో కూడా రైతులను ఆదుకున్న ప్రభుత్వం దేశం లో ఎక్కడైనా ఉందా అంటూ సూటిగా ప్రశ్నించారు. అయితే నూతన రెవెన్యూ చట్టం వలన పేదలకు సరైన న్యాయం జరుగుతుంది అని మంత్రి వ్యాఖ్యానించారు.ఈ చట్టం వలన పలు సమస్యలు తొలగిపోతాయి అని వివరించారు. అయితే వ్యవసాయ భూముల్లాగే, వ్యవసాయేతర భూములకు కూడా పట్టా పాస్ పుస్తకాలను ఇవ్వాలని రాష్ట్రం ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయాన్ని వెల్లడించారు. అయితే తమ భూములకు రక్షణ, భద్రత కల్పిస్తున్న ప్రభుత్వానికి ప్రజలు సహకరించాలి అన్ మంత్రి కోరారు.