ఇక్కడి ప్రజల మధ్య ఉండేది తెరాస నే – మంత్రి హరీష్ రావు

Friday, October 9th, 2020, 07:58:56 PM IST

దుబ్బాక ఉపఎన్నిక అంశం తెలంగాణ రాష్ట్రం లో హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ పార్టీ మరియు తెరాస ల మద్య పోటీ రసవత్తరం గా మారనుంది. అయితే ఇప్పటి నుండే ఒకరి పై మరొకరు వరుస విమర్శలు చేస్తున్నారు. అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు గానూ మంత్రి హరీష రావు ఘాటు గా బదులు ఇచ్చారు.

ఓట్లు వేసే వరకే ఉత్తమ్ కుమార్ దుబ్బాక లో ఉంటారు అని,పోలింగ్ అయిపోయినా కూడా ఇక్కడి ప్రజల మధ్య ఉండేది తెరాస నే అని మంత్రి వ్యాఖ్యానించారు. అయితే ఓట్ల కోసం వచ్చే వారికి ఓటేద్దామా, కష్ట సుఖాల్లో కలిసి ఉండే వారికి ఓటు వేద్దామా అని మంత్రి హరీష రావు ప్రజల్ని ఉద్దేశిస్తూ అన్నారు.ఈ విషయం పై ప్రజలు ఆలోచించాలి అని అన్నారు. అయితే భర్త ను కోల్పోయిన మహిళను అసమర్దరాలు అని ఎలా అంటారు అంటూ ఉత్తమ్ పై విరుచుకు పడ్డారు. మహిళా లోకాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి కించ పరిచారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు.