దుబ్బాక ఉపఎన్నికలో లక్ష ఓట్ల మెజారిటీ తో గెలుస్తాం

Saturday, September 19th, 2020, 01:14:46 AM IST


ప్రస్తుతం పరిస్తితుల్లో మరొకసారి తెలంగాణ రాష్ట్రం లో దుబ్బాక లో ఉప ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికలో లక్ష ఓట్ల మెజారిటీ తో గెలుస్తాం అంటూ తెరాస పార్టీ కి చెందిన కీలక నేత, మంత్రి హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. అయితే ఈ మేరకు కాంగ్రెస్ మరియు బీజేపీ లకు కనీసం డిపాజిట్ లు అయినా వస్తాయా అంటూ మంత్రి హరీశ్ రావు అనుమానం వ్యక్తం చేశారు.

అయితే ఆయా పార్టీలకు ఎంత విషయం ఉన్నదో ఈ ఎన్నికతో తెలుస్తుంది అంటూ మంత్రి వ్యాఖ్యానించారు. అయితే ఎన్నో ఏళ్లు గా పాలించిన కాంగ్రెస్ పార్టీ కనీసం తెలంగాణ ప్రజలకు మంచి నీళ్లను కూడా ఇవ్వలేక పోయింది అంటూ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీ కి కూడా కీలకం గా మారనుంది. రాష్ట్రం లో కాంగ్రెస్ ప్రధాన ప్రతి పక్ష పార్టీ గా అయిన ఉందనుందా లేదా అనే విషయం పై కూడా ఒక నిర్ణయం కి వచ్చే అవకాశం ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ సైతం దుబ్బాక ఉపఎన్నికలో తన సత్తా చూపేందుకు సన్నాహాలు చేస్తుంది.