డబుల్ బెడ్ రూం ఇళ్ళ పై కాంగ్రెస్ పార్టీ విమర్శల పై మంత్రి సెటైర్స్

Monday, September 21st, 2020, 07:05:17 PM IST

తెలంగాణ రాష్ట్రం లో డబుల్ బెడ్ రూం ఇళ్ళ ప్రక్రియ పై కాంగ్రెస్ పార్టీ నేతలు అధికార పార్టీ తీరును ఎండగడుతూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే ఇటీవల రాష్ట్రం లో ఆసక్తి కర పరిణామాలు చోటు చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. భట్టి విక్రమార్క ను వెంట తీసుకొని పోయి మరి మంత్రి డబుల్ బెడ్ రూం ఇళ్లను చూపించారు. అయితే ఈ వ్యవహారం పై కాంగ్రెస్ పార్టీ కీలక నేత భట్టి విక్రమార్క పలు విమర్శలు చేస్తున్నారు. అయితే దీని పై తాజాగా మరొకసారి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో లక్ష డబుల్ బెడ్ రూం ఇళ్లను కట్టించి తీరుతాం అని, అందులో వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు అని స్పష్టం చేశారు మంత్రి. అయితే ఈ వ్యవహారం లో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమర్శలు పై డైలీ సీరియల్ లాగా మాట్లాడటం తనకు ఇష్టం లేదు అంటూ సెటైర్స్ వేశారు. అయితే 111 చోట్ల ఈ డబుల్ బెడ్ రూం ఇళ్ళ నిర్మాణం జరుగుతుంది అని, మీడియా తో సహా ఎవరైనా వెళ్లి చూడవచ్చు అని అన్నారు. అయితే ఈ వ్యవహారం లో ప్రతి పక్ష పార్టీ అనుసరిస్తున్న ధోరణి ని మంత్రి తప్పుబట్టారు.