అభివృద్ధిని చూపించే దమ్ము ధైర్యం మాకు ఉన్నాయి – మంత్రి తలసాని

Friday, September 18th, 2020, 04:15:48 PM IST

Talasani

డబుల్ బెడ్ రూం ఇళ్ళ విషయం లో ప్రభుత్వం సమాధానం చెప్పలేక పోయింది అంటూ సీ ఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. అయితే తమకు లక్ష బెడ్ రూం ఇళ్లు చూపిస్తామని చెప్పి, మంత్రి మరియు మేయర్ పారిపోయారు అంటూ భట్టి విక్రమార్క సెటైర్స్ వేశారు. అయితే ఈ మేరకు భట్టి విక్రమార్క పలు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో లక్ష ఇళ్లని చూపిస్తామని చెప్పి, 3,428 ఇళ్లు మాత్రమే చూపించారు అంటూ భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

అయితే GHMC పరిధిలో కట్టిన ఇళ్లను మాత్రమే చూపించాలని, గ్రేటర్ బయట కట్టిన ఇళ్లను కూడా చూపిస్తే ఎలా అంటూ సూటిగా ప్రశ్నించారు. అయితే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాత్రం లక్ష ఇళ్ళ కి సంబంధించిన జాబితా ఇస్తాం, మీరే చూసుకోవాలి అంటూ మంత్రి తెలిపారు. నగర శివార్లలో కట్టిన ఇళ్లు కూడా నగర వాసుల కోసమే అని తేల్చి చెప్పారు. అయితే నగరంలో నే ఇళ్లు నిర్మించి ఇవ్వాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. స్థలాలు చూపిస్తే నిర్మించి ఇస్తామని మంత్రి తెలిపారు. అయితే ప్రభుత్వం పద్దతి ప్రకారం డబుల్ బెడ్ రూం ఇళ్లను పంపిణీ చేసింది అని, అయితే హైదరాబాద్ ను కూడా అభివృద్ది చేసి చూపిస్తాం అని మంత్రి అన్నారు. అభివృద్ధిని చూపించే దమ్ము, ధైర్యం మాకు ఉన్నాయి అంటూ మంత్రి తెలిపారు.