బిగ్ న్యూస్: తెలంగాణ రాష్ట్ర హోమ్ మంత్రి కి సోకిన కరోనా!

Monday, June 29th, 2020, 10:50:44 AM IST

కరోనా వైరస్ మహమ్మారి భారత్ లో ఊహించని రీతిలో వ్యాప్తి చెందుతుంది. అయితే సామాన్య ప్రజల నుండి, ప్రజా ప్రతినిధులకి సైతం కరోనా వైరస్ సోకుతుంది. తాజాగా తెలంగాణ రాష్ట్ర హోమ్ మంత్రి మహమూద్ అలీ కి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. గత కొద్ది రోజులుగా కరోనా లక్షణాలతో బాధపడుతున్న హోమ్ మంత్రి తాజాగా కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేయించుకున్నారు. ఇప్పటికే హోమ్ క్వారంటైన్ లో ఉన్న హోమ్ మంత్రి, పరీక్షల నిర్దారణ అనంతరం అపోలో ఆసుపత్రి లో చేరారు. అక్కడ ప్రత్యేక వార్డ్ లో చికిత్స పొందుతున్నారు. అయితే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ముగ్గురు ఎమ్మెల్యే లకు మరియు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అయిన విహెచ్ కి కరోనా వైరస్ సోకిన సంగతి తెలిసిందే.

తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతుంది. అన్ లాక్ డౌన్ తర్వాత కరోనా వైరస్ మహమ్మారి మరింత వ్యాప్తి చెందుతుంది. ఇప్పటికే వేల సంఖ్య లలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. వందల సంఖ్యలో కరోనా వైరస్ భారిన పడిన వారు మరణిస్తున్నారు. అయితే తాజాగా హోమ్ మంత్రి కి సైతం కరోనా వైరస్ సోకడం తో రాష్ట్ర ప్రజలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.