త్వరలో తెలంగాణలో 20 వేల పోలీస్ ఉద్యోగాలను భర్తీ చేస్తాం – హోమ్ మంత్రి

Friday, October 23rd, 2020, 12:39:17 PM IST

తెలంగాణ పోలీస్ అకాడమీ ఎస్సై ల పాసింగ్ ఔట్ పరేడ్ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర హోమ్ మంత్రి మహమూద్ అలీ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే 20 వేల పోలీస్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఈ కార్యక్రమం లో తెలిపారు. అయితే తెలంగాణ పోలీస్ అకాడమీ ద్వారా ఇప్పటి వరకూ 1,25,848 మందికి శిక్షణ ఇచ్చామని వివరించారు. అంతేకాక ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్రం లో 18,428 మంది ఎస్సై మరియు కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేశామని చెప్పుకొచ్చారు.

అయితే పోలీస్ అధికారుల పని తీరు పై పలు కీలక సూచనలు చేశారు. ప్రస్తుతం ఉన్న మార్పులకు అనుగుణంగా, పరిస్తితులను అర్దం చేసుకొని సమయోచితంగా మరియు రాజ్యాంగ బద్దంగా పని చేయాలని తెలిపారు. అయితే తెలంగాణ లో శాంతి భద్రతల పరిరక్షణ కి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది అని తెలిపారు. దేశవ్యాప్తంగా తెలంగాణ పోలీసులకు మంచి గుర్తింపు ఉందని దాన్ని నిలబెట్టుకోవాలని సూచించారు. అయితే నూతన సాంకేతికత కి ప్రాధాన్యత ఇస్తు పోలీస్ శాఖ కి అధిక బడ్జెట్ కేటాయిస్తుందని మహమూద్ అలీ పేర్కొన్నారు. కరోనా, భారీ వర్షాల సమయంలో పోలీసులు అందించిన సేవల పై ప్రశంసల వర్షం కురిపించారు. అంతేకాక పోలీస్ సేవతో రాష్ట్రానికి మంచి పేరు తీసుకు రావాలి అని, స్టేషన్ కి వచ్చే ప్రతి ఒక్కరికీ గౌరవం ఇవ్వాలి అని తెలిపారు.