బిగ్ న్యూస్: తెలంగాణలో నేటి నుండి వంద శాతం సిట్టింగ్ కెపాసిటీ తో థియేటర్లు!

Friday, February 5th, 2021, 12:02:40 PM IST

తెలంగాణ రాష్ట్రం లో థియేటర్ల కి పూర్వ వైభవం వచ్చింది. నేటి నుండి వంద శాతం సిట్టింగ్ కెపాసిటీ తో థియేటర్లు తెరుచుకొనున్నాయి. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ప్రపంచమే ఆగిపోయింది. లాక్ డౌన్ సడలింపులు చేస్తూ మెల్లగా ఆర్ధిక నష్టాన్ని పుడుస్తోంది రాష్ట్ర , కేంద్ర ప్రభుత్వాలు. అయితే సినిమాలు లేకపోవడం తో థియేటర్లు కూడా వెలవెల బోయాయి. అయితే వరుస సినిమాలు వస్తుండటం, కరోనా వైరస్ తీవ్రత కాస్త తగ్గుముఖం పట్టడం తో ఆయా రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వాలు థియేటర్ల విషయం లో కీలక నిర్ణయం తీసుకున్నాయి.

అయితే కరోనా వైరస్ మహమ్మారి కి వాక్సిన్ అందుబాటులోకి రావడం తో ఆందోళన కాస్త తగ్గింది అని చెప్పాలి. వాక్సినేషన్ ప్రక్రియ దేశ వ్యాప్తంగా శరవేగంగా కొనసాగుతుంది. అయితే దశల వారి గా జరగుతున్న ఈ ప్రక్రియ ప్రజలకి అందుబాటులోకి వచ్చేందుకు ఇంకా కాస్త సమయం పట్టనుంది. అయితే అందుకు తగ్గట్టుగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు థియేటర్లు మళ్ళీ ఇలా పునః ప్రారంభం కావడం తో ధియేటర్ యాజమాన్యాలు, సిబ్బంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సినీ పరిశ్రమ కి మళ్ళీ మంచి రోజులు వచ్చాయి అంటూ కొందరు అంటున్నారు. ఇటు ప్రేక్షకులు సైతం మళ్ళీ థియేటర్ల లోకి అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే.