ప్రభుత్వం హై అలెర్ట్ లో ఉంది…అందుకే ప్రాణ నష్టాన్ని తగ్గించ గలిగాం – కేటీఆర్

Wednesday, October 14th, 2020, 04:49:23 PM IST

తెలంగాణ రాష్ట్రం లో కురుస్తున్న భారీ వర్షాల పై, హైదరాబాద్ లో ప్రస్తుత పరిస్తితి పై మంత్రి కేటీఆర్ పలు వ్యాఖ్యలు చేశారు. ఆకాశం చిల్లులు పడుతుందా అన్నట్లుగా హైదరాబాద్ లో వర్షాలు పడుతున్నాయి అని మంత్రి వ్యాఖ్యానించారు. శాసన మండలి లో మాట్లాడిన కేటీఆర్, నిన్నటి నుండి పూర్తి స్థాయిలో క్ కేసీఆర్ పరిస్తితులను పర్యవేక్షిస్తున్నారు అని తెలిపారు. అన్ని విభాగాలతో పాటుగా, ఎన్డిఅర్ ఎఫ్ దళాలను అప్రమత్తం చేసినట్లు వివరించారు.

అయితే సహాయక చర్యల కోసం హెలికాప్టర్ లను కూడా సిద్దం చేసిన విషయాన్ని వెల్లడించారు. నేడు, రేపు సెలవులు ప్రకటించిన విషయాన్ని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్నాం అని, క్యాంప్ లను ఏర్పాటు చేసిన విషయాన్ని తెలిపారు. అన్నపూర్ణ కేంద్రాల ద్వారా మధ్యాహ్న, రాత్రి భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నాం అని అన్నారు.

అయితే గోడలు కూలి కొందరు చనిపోవడం బాధాకరం అని, నిర్మాణం లో ఉన్న భవనాలు మరియు సెల్లార్ లను పరిశీలిస్తున్నామని వివరించారు. ఇల్లు లేని వారికి షెల్టర్ లకు తరలిస్తున్నామని అన్నారు. పెట్రోలింగ్ జరుగుతుంది అని, ప్రభుత్వం హై అలెర్ట్ లో ఉంది అని, అందుకే ప్రాణ నష్టం తగ్గించ గలిగాం అని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు.