తెలంగాణ మాజీ హోమ్ మంత్రి నాయిని నర్సింహారెడ్డి కన్నుమూత

Thursday, October 22nd, 2020, 07:20:54 AM IST

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక మొదటి హోమ్ మంత్రి గా పని చేసిన నాయిని నర్సింహారెడ్డి ఇక లేరు. తీవ్ర అనారోగ్యం తో బాధపడుతున్న ఆయన అర్దరాత్రి 12:25 గంటలకు మృతి చెందిన విషయాన్ని అపోలో ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

గత నెల 28 న కరోనా వైరస్ సోకడం తో బంజారా హిల్స్ లోని ఒక ఆసుపత్రి లో చికిత్స పోందారు. ఇటీవల కరోనా వైరస్ భారీ నుండి కూడా కోలుకున్న నాయిని నర్సింహారెడ్డి, ఊపిరి తీసుకోవడం కష్టంగా మారింది. ఈ మేరకు ఆక్సిజన్ స్థాయి పడిపోవడం తో పరీక్షలు నిర్వహించగా న్యుమోనియా వచ్చినట్లు వైద్యులు తెలిపారు. మెరుగైన వైద్య చికిత్స కోసం అపోలో ఆసుపత్రి లో చేర్చగా వెంటిలేటర్ పై చికిత్స అందించడం జరిగింది. అయితే నిన్న పరిస్తితి విషమించడం తో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సైతం వచ్చి పరామర్శించారు. అర్దరాత్రి చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు మాజీ హోమ్ మంత్రి నాయిని నర్సింహారెడ్డి.