తెలంగాణ కేబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే!

Tuesday, September 8th, 2020, 12:40:28 AM IST


తెలంగాణ రాష్ట్రం లో సీఎం కేసీఆర్ పలు విప్లవాత్మక మార్పులకి తెర లేపారు. అయితే తాజాగా ముగిసిన కేబినెట్ భేటీ లో మంత్రి వర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కొత్త రెవెన్యూ బిల్లు తో పాటుగా, 17 కులాలను బీసీ జాబితా లో చేర్చాలని బీసీ కమిషన్ చేసినటువంటి సిఫార్సు లని కేబినెట్ ఆమోదం తెలిపింది. అయితే రెవెన్యూ బిల్లును బుధవారం నాడు అసెంబ్లీ లో పెట్టనున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు.

అయితే నేడు జరిగిన ఈ భేటీ లో కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు రాష్ట్రం లో పలు మార్పులకి నాంది అని చెప్పాలి. ది తెలంగాణ అబాలిషన్ ఆఫ్ ద పోస్ట్ ఆఫ్ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ బిల్ 2020 కి ఆమోదం తెలిపింది.ది తెలంగాణ రైట్స్ ఇన్ లాండ్ అండ్ పట్టాడార్ పాస్ బుక్స్ బిల్లు కి ఆమోదం తెలిపింది.అయితే పంచాయతీ రాజ్ మరియు రు రల్ డెవెలప్ మెంట్ గ్రామ పంచాయతీ ట్రాన్స్ ఫర్ ఆఫ్ నాన్ అగ్రికల్చ రల్ ప్రాపర్టీ యాక్టు 2018 సవరణ కి ఆమోదం తెలిపింది. తెలంగాణ మున్సిపాలిటి యాక్టు2019 తో పాటుగా, తెలంగాణ జీ ఎస్ టి యాక్టు 2017 ల సవరణ బిల్లుకి ఆమోదం తెలిపింది.

తెలంగాణ ఎస్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీ యాక్టు అమెండ్మెంట్ ఆర్డినెన్సు 2020, ది తెలంగాణ డిజాస్టర్ అండ్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ 2020, ది తెలంగాణ ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట మేనేజ్మెంట్ బిల్ 2002 ఎల్, ఆయుష్ మెడికల్ కాలేజీల్లో అధ్యాపకుల పదవి విరమణ వయో పరిమితిని పెంచే ఆర్డినెన్సు లకు ఆమోదం తెలిపింది. వీటి తో పాటుగా టీ ఎస్ ఐపాస్ బిల్, తెలంగాణ కోర్టు ఫీజ్ అండ్ సూట్స్ లకు ఆమోదం తెలిపింది. వాల్యుయేషన్ యాక్టు 1956 సవరణ బిల్లు ను ఆమోదస్తు కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి ది తెలంగాణ సివిల్ కోర్ట్స్ యాక్టు 1972 సవరణ బిల్లు, కొత్త సెక్రెటరియెట్ నిర్మాణం, పాత సెక్రెటరియెట్ కూల్చివేతకు అయ్యే వ్యయలకు సంబంధించిన పరిపాలన అనుమతులను ఆమోదించింది.