హైలెట్స్ : తెలంగాణ బడ్జెట్ రూ.2,30,825 కోట్లు

Thursday, March 18th, 2021, 01:12:52 PM IST

తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక మంత్రి హరీష్ రావు శాసన సభ లో రూ.2,30,825 కోట్లతో 2021-22 సంవత్సరానికి గానూ రాష్ట్ర బడ్జెట్ ను గురువారం నాడు శాసన సభ లో ప్రవేశ పెట్టారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.1,69,383.44 కొట్లు కాగా, క్యాపిటల్ వ్యయం రూ.29,046.77 కొట్లు, రెవెన్యూ మిగులు రూ.6,743.50 కొట్లు గా పేర్కొన్నారు. ఆర్ధిక లోటు రూ.40,509.60 కొట్లు గా ఉంది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అబివృద్ధి పథంలో దూసుకుపోతుంది అని తెలిపిన మంత్రి హరీష్ రావు, అన్ని వర్గాల ఆకాంక్షలకు తగ్గట్టు గా బడ్జెట్ ఉందని అన్నారు.

దేవాదాయ శాఖ కి రూ.720 కొట్లు, అటవీ శాఖ కి రూ.1,276 కొట్లు, ఆర్టీసి కి రూ.1500 కోట్ల రూపాయలను కేటాయించారు. రీజనల్ రింగ్ రోడ్ భూ సేకరణకు రూ.750 కొట్లు, నూతన సచివాలయం నిర్మాణం కొరకు రూ.610 కొట్లు కేటాయించగా, పశు సంవర్దక మత్స్య శాఖ కి రూ.1,730 కోట్ల రూపాయలను కేటాయించారు.

వ్యవసాయ రంగానికి రాష్ట్రం పెద్ద పీఠ వేసింది. వ్యవసాయ రంగానికి 25 వేల కోట్ల రూపాయలను కేటాయించారు. రైతు బంధు కొరకు 14,800 కొట్లు కేటాయించగా, రైతు రుణ మాఫీ కోసం 5,225 కొట్లు, రైతు భీమా కోసం 1,200 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది.

సాగునీటి రంగానికి 16,931 కోట్లను కేటాయించగా, పంచాయితీ గ్రామీణ శాఖ అభివృద్ది కొరకు 29,271 కోట్ల రూపాయలను కేటాయించారు. ఆసరా పింఛన్లకు 11,728 కొట్లు, కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ పథకాలను 2,750 కోట్లను కేటాయించడం జరిగింది.

డబుల్ బెడ్ రూం ఇళ్ళ నిర్మాణం కొరకు 11 వేల కోట్లు, స్త్రీ శిశు సంక్షేమం కోసం 1,502 కొట్లు, మైనారిటీ ల సంక్షేమం కోసం 1,606 కొట్లు కేటాయించగా, పౌర సరఫరాల శాఖ కి రూ.2,363 కొట్లు, చేనేత కార్మికుల సంక్షేమం కోసం రూ.338 కొట్లు, బీసీ కార్పొరేషన్ కి వెయ్యి కోట్లు, గీతా కార్మికుల సంక్షేమం కొరకు రూ.25 కొట్లు, సాంస్కృతిక పర్యాటక రంగం కి 726 రూపాయలను కేటాయించారు.

విద్యుత్ రంగం కూడా బడ్జెట్ లో కీలకం అయింది. విద్యుత్ రంగానికి రూ. 11,046 కోట్లను కేటాయించగా, పరిశ్రమ శాఖ కి రూ. 3,077 కోట్లను కేటాయించడం జరిగింది. ఐటీ రంగానికి 360 కోట్ల రూపాయలు, దేవాదాయ శాఖ కి 720 కొట్లు, హోమ్ శాఖ కి 6,465 కోట్ల రూపాయలను కేటాయించారు. ఆర్ అండ్ బీ కి 8,788 కోట్ల రూపాయలు కేటాయింపు.

పాటశాల విద్య కోసం 11,735 కొట్లు, ఉన్నత విద్య కొరకు 1,873 కొట్లు, 4 వేల కోట్ల రూపాయలతో సరికొత్త విద్యా పథకం. వైద్య ఆరోగ్య శాఖ కొరకు 6,295 కోట్ల రూపాయల కేటాయింపు. మెట్రో రైలు కొరకు వెయ్యి కోట్లు, పురపాలక, పట్టణాభివృద్ధి కొరకు 15,030 కొట్ల రూపాయల కేటాయింపు. అదే విధంగా సీఎం దళిత ఎంపవర్మెంట్ కొరకు వెయ్యి కొట్లు, మూసీ సుందరీకరణ కి 200 కొట్లు, హైదరాబాద్ ఉచిత నీటి సరఫరా కొరకు 250 కోట్ల రూపాయల కేటాయింపు.ఎయిర్ స్ట్రిప్ నిర్మాణం కొరకు 100 కోట్ల రూపాయల కేటాయింపు.