బిగ్ న్యూస్: నూతన రెవెన్యూ చట్టానికి అసెంబ్లీ ఆమోదం!

Friday, September 11th, 2020, 07:08:21 PM IST

తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రెవెన్యూ చట్టానికి అసెంబ్లీ ఆమోదం తెలిపింది. రెండు రోజుల పాటు గా ఈ బిల్లు పై సుదీర్ఘ చర్చల అనంతరం ఈ బిల్లుకి అసెంబ్లీ ఆమోదం తెలపడం జరిగింది.ఈ బిల్లు నీ ఎటువంటి సవరణలు లేకుండా నే ఆమోదించినట్లు రాష్ట్ర శాసన సభ స్పీకర్ పోచారం తెలిపారు.

మూజువాణి ఓటింగ్ ప్రక్రియ తో సభ లో ఈ బిల్లుని ప్రవేశ పెట్టడం జరిగింది. అయితే అయితే దీంతో ఇక పై తెలంగాణ రాష్ట్రం లో వీఆర్వో వ్యవస్థ ఇక శాశ్వతం గా రద్దు కానుంది. అయితే ఈ బిల్లు ప్రకారం ఇక పై రిజిస్ట్రేషన్ మరియు మ్యుటేషన్ ప్రక్రియ ఒకేసారి జరగనుంది. అయితే కొత్తగా ఎర్పడిన ఈ చట్టం ప్రకారం ఎమ్మార్వో లే ఇక పై వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. అయితే తెలంగాణ ధరణి పోర్టల్ లోనే ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగనుంది. ఎన్నో కీలక నిర్ణయాలను తీసుకున్న సీఎం కేసీఆర్ ఈ బిల్లు ఆమోదం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, ఇది చారిత్రాత్మక చట్టం అని కొనియాడారు.