తెలంగాణలో కరోనా అదుపులోనే ఉంది.. పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ కీలక వ్యాఖ్యలు..!

Tuesday, August 25th, 2020, 04:03:43 PM IST

తెలంగాణలో రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. అయితే కరోనాను అదుపు చేయడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమయ్యిందని ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా చేస్తూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే ఇటీవల కరోనా పరిస్థితులపై గవర్నర్ తమిళ సై కూడా ప్రభుత్వ తీర్పుపై అసంతృప్తి వ్యాఖ్యలు చేశారు.

అయితే తాజాగా రాష్ట్రంలో కరోనా పరిస్థితి అదుపులోనే ఉందని, ఈ నెల చివరి నాటికి కేసులు ఇంకా తగ్గుముఖం పడుతాయని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు తెలిపారు. అయితే గ్రామీణ ప్రాంతాలలో కేసులు పెరిగే ఛాన్స్ ఉందని, ప్రతి రోజు 40 వేల కరోనా టెస్టులు చేస్తున్నామని అన్నారు. ఇప్పటి వరకు జరిగిన టెస్టులలో 50 శాతం ఆగష్ట్ నెలలోనే జరిగాయని, మరణాల రేటు కూడా తక్కువగానే ఉందని అన్నారు.