ఇంటింటికి నల్లా కనెక్షన్లలో తెలంగాణ నంబర్ 1, చివరలో ఏపీ..!

Thursday, August 20th, 2020, 09:00:41 AM IST

ఇంటింటికి నల్లా కలెక్షన్ల ద్వారా మంచి నీరు సరఫరా చేయడంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నంబర్ 1 స్థానంలో నిలిచింది. అయితే తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత మిషన్ భగీరధ ద్వారా మారుమూల గ్రామాలకు కూడా మంచి నీటి సరఫరా అందేలా చేసింది.

అయితే తాజాగా నిర్వహించిన సర్వేలో తెలంగాణలో 98.31% ఇళ్ళకు మంచి నీటి నల్లా కలెక్షన్లు ఉన్నట్టు తెలిసింది. అయితే తెలంగాణ తరువాత 89.05% తో గోవా రాష్ట్రం రెండో స్థానంలో నిలవగా, 87.02% తో కేంద్ర పాలిత ప్రాంతం పుదిచ్చేరి మూడో స్థానంలో నిలిచింది. ఇది పక్కన పెడితే తెలంగాణ పక్క రాష్ట్రం, తెలుగు రాష్ట్రం ఏపీ మాత్రం నల్లా కలెక్షన్లలో అట్టడుగు స్థానాలలో నిలిచింది. అయితే 2.05% తో పశ్చిమ బెంగాల్ చివరి స్థానంలో నిలిచింది.