తెలంగాణలో మినీ పురపోరు ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం!

Monday, May 3rd, 2021, 09:21:04 AM IST

తెలంగాణ రాష్ట్రం లో ఇటీవల నిర్వహించిన మినీ మునిసిపల్ ఎన్నికల కి సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ నేడు ఉదయం 8 గంటలకు ప్రారంభం అయింది. ఖమ్మం, వరంగల్ నగర పాలక సంస్థల తో పాటు గా, సిద్దిపేట, అచ్చంపేట, జడ్చర్ల, నకిరేకల్,.కొత్తూరు పురపాలక సంఘాలతో పాటుగా, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో లింగోజి గూడా, మరో నాలుగు మునిసిపాలిటి ల్లోని నాలుగు వార్డ్ లకు నేడు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అయింది. వీటన్నింటికీ సంబంధించిన ఫలితాలు రాత్రి వరకు వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ ఎన్నికల్లో సైతం అధికార పార్టీ తెరాస ఎక్కువ స్థానాల్లో విజయం సాధిస్తుంది అని ఇప్పటికే ఆ పార్టీ కి చెందిన నేతలు చెబుతున్నారు.