పసుపు రైతులకు మద్ధతుగా రేవంత్ రెడ్డి ఒక్కరోజు దీక్ష..!

Saturday, January 30th, 2021, 08:16:44 AM IST

నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు, పసుపు పంటకు కనీస మద్దతు ధర కోసం గత కొన్ని రోజులుగా పసుపు రైతుల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో రైతులు ఆందోళన చేస్తున్నారు. ఈ నేపధ్యంలో వారికి మద్ధతుగా ఆర్మూర్ పట్టణంలో రాజీవ్ రైతు భరోసా దీక్ష పేరుతో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. అయితే ఈ దీక్షకు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి హాజరవుతున్నారు.

ఇదిలా ఉంటే తనను ఎంపీగా గెలిపిస్తే ఐదు రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని ఎంపీ అర్వింద్‌ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే కేంద్ర ప్రభుత్వం పసుపు బోర్డుకు బదులుగా స్సైసెస్ బోర్డు ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. ఈ నేప్ధ్యంలో పసుపు బోర్డు ఏర్పాటు-పసుపు పంటకు మద్దతు ధర ప్రధాన డిమాండ్లతో 24గంటలపాటు రేవంత్‌ ఈ దీక్ష చేయనున్నారు. ఎక్కడ్నుంచి అయితే, బీజేపీ అగ్రనేతలు పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారో అక్కడే రేవంత్‌ దీక్షకు దిగుతున్నారు.