ఇళ్లు నేనే కట్టిస్తా…పెళ్లి నేనే చేస్తానంటున్న ఏకైక సీఎం కేసీఆర్

Monday, October 26th, 2020, 01:08:32 PM IST

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై మంత్రి కేటీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల పై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇళ్లు నేనే కట్టిస్టా, పెళ్లి నేనే చేయిస్తా అని అంటున్న ఏకైక సీఎం కేసీఆర్ అంటూ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. హైదరాబాద్ మహ నగరం లో డబుల్ బెడ్ రూం ఇళ్లకు శ్రీకారం చుట్టిన మంత్రి కేటీఆర్, జియాగుడ లో 840 లబ్ది దారులకు డబుల్ బెడ్ రూం ఇళ్లను మంత్రి కేటీఆర్ పంపిణీ చేశారు. ఈ మేరకు ఆ కార్యక్రమంలో పలు వ్యాఖ్యలు చేశారు.

అయితే ఇళ్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటూ పెద్దలు సామెతలు చెబుతూ ఉంటారు అని, ఆ రెండు పనులు చేయడమంటే కష్టంతో కూడుకున్న పని అని మంత్రి కేటీఆర్ అన్నారు. కానీ ఇళ్లు నేనే కట్టిస్తా, పెళ్లి నేనే చేస్తా అని అన్నది రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కరే అంటూ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. అయితే రాష్ట్రం లోని డబుల్ బెడ్ రూం ఇళ్ళ నిర్మాణం పేదల ఆత్మ గౌరవం కి ప్రతీక అని మంత్రి కేటీఆర్ అన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో ఇళ్లు కట్టినట్లు చూపించి డబ్బులు దండుకున్నారు అని మంత్రి సంచలన ఆరోపణలు చేశారు. అయితే తల్లిదండ్రులకు పేదింటి ఆడబిడ్డ భారం కాకూడదు అనే ఉద్దేశ్యం తో కళ్యాణ లక్ష్మీ పథకం ను తీసుకొచ్చిన విషయాన్ని మంత్రి కేటీఆర్ వివరించారు.