మంత్రి చేతి కడియం మాయం – షాక్ లో తెలంగాణ మంత్రి

Friday, February 14th, 2020, 02:54:36 PM IST

తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ కి నేడు ఒక ఊహించని పెద్ద షాక్ తగిలింది. కాగా ఒక పెళ్లి వేడుకకు హాజరైన మంత్రి శ్రీనివాస్ గౌడ్ అనుకోకుండా తన చేతి కడియాన్ని పోగొట్టుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే… మహబూబ్ నగర్ జిల్లా, దేవరకద్రలో జరుగుతున్నటువంటి ఒక పెళ్లి వేడుకకి హాజరైన తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్, తన దగ్గరికి వచ్చిన బహిమానులు, కార్యకర్తలతో కలిస్లు సెల్ఫీలకు పోజిచ్చారు. అంతేకాకుండా వారితో పాటు కాసేపు సరద్దగా కూడా గడిపారు. కాగా ఈ క్రమంలోనే ఆయన తన చేతికి ఉన్నటువంటి కడియాన్ని ఎక్కడో పోగొట్టుకున్నారు.

అయితే ఒక్కసారిగా తన కడియం కనిపించకపోవడంతో దాన్ని ఎలాగైనా వెతికి పట్టుకోవాలని మంత్రి తన అనుచరులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో వారిమీద ఆగ్రహం కూడా వ్యక్తం చేశారని సమాచారం. ఇకపోతే ఆ కడియం మంరి శ్రీనివాస్ గౌడ్ కి చాలా ప్రత్యేకం అని తెలుస్తుంది. ఆ కడియం తన చేతికి వచ్చాకనే ఆయనకు బాగా కలిసి వచ్చిందని, ఆయనకు అన్ని విజయాలు రాడానికి కూడా కారణం ఆ కడియమే అని సమాచారం. అందుకనే మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ ఆ కడియం విషయంలో తన అనుచరులపై అంత సీరియస్ అవుతున్నారని సమాచారం.