బండి సంజయ్ వ్యాఖ్యలపై తెలంగాణ ఐపీఎస్ అసోసియేషన్ సీరియస్..!

Thursday, March 18th, 2021, 02:00:40 AM IST


భైంసా ఘటనకు సంబంధించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ ఐపీఎస్ అసోసియేషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. భైంసా ఘటనలో శాంతి భద్రతల అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు తీవ్ర కృషి చేశారని పేర్కొంది. పోలీసులపై ప్రజలకు నమ్మకం పోయేలా బండి సంజయ్ వాఖ్యనించడం సరికాదంటూ మండిపడింది. అంతేకాదు శాంతి భద్రతల పరిరక్షణ కోసం పగలు, రాత్రి తేడాలేకుండా కష్టపడుతున్నామని, కరోనా సమయంలోనూ పోలీసులు కీలక పాత్ర పోషించారని అలాంటి పోలీస్ వ్యవస్థపై బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలంగాణ ఐపీఎస్ అసోసియేషన్ పేర్కొంది.