దేశంలోనే అత్యధిక మొక్కలు నాటిన రాష్ట్రంగా తెలంగాణ రికార్ద్..!

Monday, March 8th, 2021, 10:11:53 PM IST

పచ్చదనం పెంపొందించేందుకై హరితహారం పేరిట కోట్లాది మొక్కలు నాటుతూ ముందుకు సాగుతున్న తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అత్యధిక మొక్కలు నాటిన రాష్ట్రంగా రికార్డ్ సృష్టించింది. ఈ విషయాన్ని కేంద్ర అటవీశాఖ మంత్రి బాబుల్ సుప్రియో అధికారికంగా ప్రకటించారు. నేడు రాజ్యసభలో కాంగ్రెస్‌ నేత జీ.సీ చంద్రశేఖర్‌ అడిగిన ప్రశ్నకు మంత్రి బాబుల్ సుప్రయో లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.

అయితే దేశ వ్యాప్తంగా 150.23 కోట్ల మొక్కలు నాటితే 2019-20లో ఒక్క తెలంగాణలోనే 38.17 కోట్ల మొక్కలు నాటినట్టు ఆయన వెల్లడించారు. అయితే తెలంగాణ రాష్ట్రం ఈ రికార్డు సాధించడం పట్ల రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ మానసపుత్రిక హరిత హారం కార్యక్రమం వల్లే తెలంగాణకు ఈ ఘనత దక్కిందని, ఈ సందర్భంగా ట్విట్టర్ ద్వారా సీఎం కేసీఆర్‌కు సంతోష్ కుమార్ అభినందనలు తెలిపారు.