అక్రమ లే ఔట్లపై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్ట్ నోటీసులు..!

Thursday, September 17th, 2020, 10:20:11 PM IST


తెలంగాణలో అక్రమ లే ఔట్లపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎల్ఆర్ఎస్ విషయంలో ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ దాఖలు చేసిన పిటీషన్‌పై నేడు హైకోర్ట్ విచారణ జరిపింది. అయితే ఎల్ఆర్ఎస్ పలు చట్టాలకు విరుద్ధంగా ఉందని సీనియర్ న్యాయవాది సత్యం రెడ్డి వాదనలు వినిపించారు. దీనిపై మద్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.

అయితే దీనిపై రెండు వారాలు గడువు కావాలని ఏజీ బీఎస్ ప్రసాద్ కోర్టుకు తెలిపారు. అయితే తుది తీర్పుకు లోబడి ఉండేలా ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్ కోరగా దీనిపై ప్రభుత్వ వైఖరి తెలుసుకోకుండా ఆదేశాలు ఇవ్వలేమన్న న్యాయస్థానం తేల్చి చెప్పింది. అంతేకాదు దీనిపై స్పందించి కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ, తదుపరి విచారణను న్యాయస్థానం అక్టోబర్ 8వ తేదీకి వాయిదా వేసింది.