ఆ ప్రక్రియను ఆపండి.. టీఆర్ఎస్ సర్కార్‌కు హైకోర్టులో చుక్కెదురు..!

Wednesday, November 11th, 2020, 05:36:37 PM IST

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. సాదా బైనమాల క్రమబద్ధీకరణ అంశంపై నేడు విచారణ చేపట్టిన హైకోర్టు క్రమబద్ధీకరణ కోసం కొత్తగా అందిన దరఖాస్తులను పరిశీలించవద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త రెవెన్యూ చట్టం అమలు తర్వాత వచ్చిన దరఖాస్తులను పరిశీలించవద్దని ప్రభుత్వానికి హైకోర్టు తేల్చి చెప్పింది. రద్దు చేసిన చట్టం ప్రకారం సాదాబైనామాలను ఎలా క్రమబద్ధీకరిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

చట్టం రద్దు అనంతరం ఇలా దరఖాస్తులను స్వీకరించడం మోసపూరిత చర్యే అంటూ కోర్టు తీవ్ర వాఖ్యలు చేసింది. అయితే అక్టోబర్‌ 29 నుంచి కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి వచ్చిందని అప్పటి నుంచి ప్రభుత్వానికి 6,74,201 దరఖాస్తులు వచ్చాయని ఏజీ హైకోర్టుకు తెలిపారు. అయితే తాము తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఆ దరఖాస్తులను పరిశీలించవద్దని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపింది.