రాంగోపాల్‌ వర్మకు షాక్ ఇచ్చిన హైకోర్టు.. షోకాజ్ నోటీసులు జారీ..!

Tuesday, November 24th, 2020, 06:40:02 PM IST

వివాదస్పద సినిమాల దర్శకుడు రాంగోపాల్ వర్మ గత ఏడాది తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపిన దిశ హత్య కేసుపై సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే ఆ మూవీకి సంబంధించిన ఫ‌స్ట్ లుక్‌, ట్రైలర్‌ని కూడా రిలీజ్ చేశారు. అంతేకాదు ఈ ఏడాదు నవంబర్ 26 ఈ సినిమా రిలీజ్ చేస్తున్నట్టుగా కూడా వర్మ ఇప్పటికే ప్రకటించారు. అయితే ఈ సినిమాను నిలిపివేయాలని కోరుతూ నిందితుల కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

అయితే దీనిపై నేడు హైకోర్టు విచారణ చేపట్టగా నిందితుల కుటుంబ సభ్యులు ఇప్పటికే తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని, చిత్రంలో నిందితులను దోషులుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని నిందితుల తరపు న్యాయవాది కృష్ణమూర్తి కోర్టుకు తెలిపారు. సినిమా విడుదలైతే వారిని ఊరిలో కూడా ఉండనీయరని చిత్రం విడుదల కాకుండా స్టే ఇవ్వాలని కోరారు. అయిన ఈ కేసుపై జ్యుడీషియల్‌ కమీషన్‌ విచారణ జరుగుతుంటే వర్మ సినిమాను ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. దీంతో వర్మకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసిన హైకోర్టు తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.