తెలంగాణలో దీపావళికి భాణసంచా బ్యాన్.. హైకోర్టు కీలక ఆదేశాలు..!

Thursday, November 12th, 2020, 03:27:36 PM IST

తెలంగాణలో దీపావళి పండుగపై ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దీపావళి సందర్భంగా భాణసంచాను బ్యాన్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీపావళికి క్రాకర్స్ పేల్చకుండా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో న్యాయవాది ఇంద్ర ప్రకాశ్ పిటీషన్ దాఖలు చేశారు. తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య ఇంకా తగ్గలేదని, టపాసుల వల్ల వెలువడే పొగతో ప్రజలు మరింత శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఎదుర్కొంటారని అందుకే బాణసంచాను పేల్చకుండా నిషేధం విధించాలంటూ పిటీషన్‌లో పేర్కొన్నారు. పిటీషనర్ వాదనలు విన్న న్యాయస్థానం రాష్ట్రంలో భాణసంచాపై బ్యాన్ విధించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంతేకాదు ఇప్పటికే తెరిచిన బాణాసంచా షాపులను కూడా మూయించాలని, ఎవరైనా బాణసంచా అమ్మకాలు జరిపితే వారిపై కేసులు నమోదు చేయాలని హైకోర్టు తెలిపింది.