రాబోయే రోజుల్లో కరోనా తో జీవించాలి – ఈటెల రాజేందర్

Friday, August 28th, 2020, 10:00:08 PM IST

భారత దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువగా నమోదు అవుతున్నప్పటకి తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ భారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య తక్కువే అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. అంతేకాక ప్రపంచం లో కరోనా కంటే భయంకర వ్యాధులు వచ్చాయి అని, అప్పుడు ప్రజలు ఇంతలా భయపడలేదు అని తెలిపారు. అయితే కరోనా కి చంపే శక్తి లేదు అని మంత్రి అన్నారు. దీనిని సత్వరమే గురించి చికిత్స చేయించుకోవాలి అని ముందు జాగ్రత్త చర్యలు తెలిపారు.

కరోనా వైరస్ ను అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మంత్రి వివరించారు. బస్తీ దవాఖానా ల గురించి ప్రస్తావించారు. వీటిల్లో మందులకు కొదవ లేదు అని తెలిపారు. అయితే ఇక్కడ కూడా కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేయిస్తున్నాం అని తెలిపారు. గత వారం రోజుల నుండి రోజుకి దాదాపు 60 వేల వరకు కరోనా టెస్టులు చేస్తున్న విషయాన్ని తెలిపారు.అయితే దేశ వ్యాప్తంగా కరోనా తో మరణిస్తున్న వారి తో పోల్చితే తెలంగాణ లో తక్కువే అని తెలిపారు. ప్రజల్లో కరోనా పట్ల అవగాహన పెరిగింది అని, ఇక రాబోయే రోజుల్లో కరోనా తో జీవించాలి అని అన్నారు.