లాక్ డౌన్ పై క్లారిటీ ఇచ్చిన తెలంగాణ హెల్త్ డైరెక్టర్

Monday, March 22nd, 2021, 06:02:40 PM IST

ప్రపంచ దేశాలు కరోనా వైరస్ మహమ్మారి భారిన పడ్డాయి. అయితే భారత్ లో కూడా దీని తీవ్రత ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే పరిస్థితులు చూస్తుంటే రెండవ వేవ్ వచ్చేసింది అంటూ పలువురు నిపుణులు అంటున్నారు. అయితే తెలంగాణ రాష్ట్రం లో సైతం పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. అయితే తెలంగాణ రాష్ట్రం లో మళ్లీ లాక్ డౌన్ ఉందా లేదా అనే దాని పై తెలంగాణ రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే రాష్ట్రం లో లాక్ డౌన్ కానీ, కర్ఫ్యూ ప్రపోజల్ కానీ పెట్టలేదు అని తెలిపారు. అయితే విద్యా సంస్థల్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి అని అన్నారు. అయితే విద్యార్థుల ద్వారా ఇంట్లో ఉన్న వృద్దులకు, దీర్ఘ కాలిక వ్యాధులు ఉన్న వారికి ప్రమాదం పొంచి ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

అయితే రాష్ట్రం లో పాజిటివ్ కేసుల పెరుగుదల చూస్తే సెకండ్ వేవ్ అనే చెప్పాలి అంటూ చెప్పుకొచ్చారు. గత ఏడాది ఏ చర్యలు అయితే చేపట్టమో, అవే మళ్ళీ ప్రారంభించాం అని అన్నారు. అయితే ప్రజల మద్దతు కావాలని, దయ చేసి మాస్కులు ధరించండి అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాక వాక్సిన్ కు అర్హులు అయిన వారు అంతా కూడా వాక్సిన్ వేయించుకోవాలి అని వ్యాఖ్యానించారు.