గణేశ్ మండపాలు ఏర్పాటు చేయొద్దు.. తెలంగాణ ప్రభుత్వం కీలక సూచనలు..!

Monday, August 17th, 2020, 07:10:30 PM IST

కరోనా ప్రభావం కారణంగా ఈ ఏడాది వినాయక చవితి పండుగపై తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు కీలక సూచనలు చేసింది. ఈ సంవత్సరం రాష్ట్ర ప్రజలందరూ గణేష్‌ విగ్రహాలను ఇంట్లోనే ప్రతిష్టించుకుని పండగను జరుపుకోవాలని, ఎక్కడా మండపాలు ఏర్పాటు చేయొద్దని చెప్పింది.

నేడు వినాయక ఉత్సవాలపై మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ హోంమంత్రి మహమూద్‌ అలీతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు హైదరాబాద్‌, రాచకొండ, సైబరాబాద్‌ పోలీస్‌ కమీషనర్లతో పాటు జీహెచ్‌ఎంసీ కమీషనర్‌, భాగ్యనగర్‌ గణేష్ ‌ఉత్సవ సమితి నాయకులు హాజరయ్యారు.‌ ఈ సందర్భంగా తలసాని మీడియాతో మాట్లాడుతూ కరోనా కారణంగా ఇంట్లోనే ప్రజలందరు గణేశ్ పండుగ జరుపుకోవాలని, సంప్రదాయబద్దంగా పూజలు నిర్వహించుకుని గణేశ్ నవరాత్రులను పూర్తి చేసుకోవాలని పిలుపునిచ్చారు.